తప్పుడు ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త

Published Fri, Mar 1 2024 4:43 AM

SEBI Issues Advisory Against Fraudulent Trading Schemes  - Sakshi

స్టాక్‌ ట్రేడింగ్‌పై సెబీ హెచ్చరికలు

తప్పుదారి పట్టించే ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మార్గంలో దేశీ ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొనే ప్లాట్‌ఫామ్స్‌పట్ల అప్రమత్తతను ప్రదర్శించవలసిందిగా సూచించింది. మోసగాళ్లు స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కోర్సులు, సెమినార్లు, మెంటార్‌íÙప్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు వివరించింది.

ఇందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వాట్సాప్‌ లేదా టెలిగ్రామ్‌ తదితర లైవ్‌ బ్రాడ్‌క్యాస్ట్‌లను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టరైన ఎఫ్‌పీఐలు లేదా ఉద్యోగులులా మభ్యపెడుతూ అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునేలా వ్యక్తిగత ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఖాతాల లబ్దిని అందుకోమని ప్రోత్సహిస్తూ షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు తదితరాలను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఎలాంటి ట్రేడింగ్‌ లేదా డీమ్యాట్‌ ఖాతా అవసరంలేదంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు వివరించింది. ఈ పథకాలకు తప్పుడు పేర్లతో రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్లను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement