
న్యూఢిల్లీ: సెబీ తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సంస్థలు, వ్యక్తులకు విడిగా రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశించింది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్(ఎఫ్‌సీఆర్‌ఎల్)సహా 14 సంస్థ లు, వ్యక్తులపై సెబీ జరిమానా విధించింది. ప్రాగ్జిస్ హోమ్ రిటైల్‌లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా పెరిగిన నేపథ్యంలో వాటాదారుల(పబ్లిక్)కు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంది.
అయితే ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. తప్పనిసరిగా మార్పిడయ్యే 3,180 డిబెంచర్ల(సీసీడీలు)ను ఈక్విటీగా మార్చడంతో 2020 ఫిబ్రవరి 11కల్లా ప్రాగ్జిస్‌లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 5.71 శాతం పెరిగింది. తద్వారా ప్రాగ్జిస్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 47.43% నుంచి 53.13 శాతానికి బలపడింది. అయితే ఎస్‌ఏఎస్‌టీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సంబంధిత 15 సంస్థలు, వ్యక్తులకు సెబీ జరిమానా విధించింది.