ఒక్క ఎస్ఎంఎస్ తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్ | SBI Pension Loan Upto Rs 14 Lakh at Great Interest Rate | Sakshi
Sakshi News home page

ఒక్క ఎస్ఎంఎస్ తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్

Feb 23 2021 8:19 PM | Updated on Feb 23 2021 8:49 PM

SBI Pension Loan Upto Rs 14 Lakh at Great Interest Rate - Sakshi

దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు కోసం సరికొత్త లోన్ ఆప్షన్ ను ముందుకు తీసుకోని వచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఎస్‌బీఐ పెన్షన్ లోన్ అందిస్తుంది. ఇందుకోసం కేవలం ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే చాలని భరోసా కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని పేర్కొంది.

PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్ చేయాలని తన ట్వీట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాగే 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బాక్ చేస్తారు. మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, మీ డ్రీమ్ హోమ్ కొనుగోలు చేసేందుకు, మెడికల్ అవసరాల కోసం రిటైర్మెంట్ ఫండ్ తరహాలో ఎస్‌బీఐ పెన్షనర్లకు పెన్షన్ లోన్ అందిస్తుంది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 

చదవండి:

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement