Samsung Galaxy F13 India Launch Date: Check Price And Other Specifications - Sakshi
Sakshi News home page

Samsung Galaxy F13: ఫీచర్లు, ధర ఎలా ఉంటాయి?

Jun 21 2022 3:22 PM | Updated on Jun 21 2022 4:14 PM

Samsung Galaxy F13 India launch on 22nd june - Sakshi

సాక్షి,ముంబై: శాంసంగ్‌  బడ్జెట్‌ ధరలో ‘గెలాక్సీ ఎఫ్ 13’  అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించనుంది.  బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా దీన్ని  తీసుకొస్తోంది.  శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌   ద్వారా  ఈ  గెలాక్సీ ఎఫ్‌13 ఫోన్ విక్రయానికి రానుంది.  బడ్జెట్‌ ధరలో, అందులోనూ అంతేకాదు ఆటో డేటా స్విచింగ్ సదుపాయంతో   కంపెనీ తొలిఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

శాంసంగ్‌ గెలాక్సీ  ఎఫ్ 13 ఫీచర్లు , అంచనాలు 
6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎక్సినోస్ 850 ప్రాసెసర్
8జీబీ ర్యామ్
50 ఎంపీ  రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ  కెమెరా 
6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ 

పింక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభించనున్న గెలాక్సీ  ఎఫ్ 13  ధర సుమారు రూ.12వేల గా ఉంటుందని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement