Russia Invasion Ukraine: Food Items To Sell Them At Hefty Prices In Russia - Sakshi
Sakshi News home page

Russia: యుద్ధం ఎఫెక్ట్‌.. ఫాస్ట్‌పుడ్‌ ఎగబడి కొంటున్న రష్యన్లు!

Mar 14 2022 11:46 AM | Updated on Mar 14 2022 1:34 PM

Russia Invasion Ukraine : food items to sell them at hefty prices in Russia - Sakshi

Russia-Ukraine War: నాటో, అమెరికా, యూరోపియన్‌ యూనియన్ల మాటేమో గానీ రష్యన్లకు వాళ్ల అధ్యక్షుడు పుతిన్‌ నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. దేశాధ్యక్షుడిగా పుతిన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చాపకింద నీరులా దేశంలో అరాచక పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బ్రేక్‌ ఫాస్ట్‌ చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 

నాటో దేశాలతో దోస్తీ చేస్తూ రష్యాకు ప్రమాదకరంగా మారిందనె నెపంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాడు పుతిన్‌. వారాలు గడుస్తున్నా ఉక్రెయిన్‌ తలవంచడం లేదు..  యుద్ధం ముగియడం లేదు. మరోవైపు రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ యూరప్‌ దేశాలు, అమెరికా మిత్ర పక్షాలు రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ పోతున్నాయి. మెక్‌డొనాల్డ్‌ వంటి ఫుడ్‌ చైయిన్లు మొదలు యాపిల్‌, శామ్‌సంగ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ దిగ్గజాలు రష్యాకు టాటా చెబుతున్నాయి.

రష్యాతో వ్యాపారం చేయబోమంటూ ప్రసిద్ధ కంపెనీలు వరుసగా ఇస్తున్న ప్రకటనలు రష్యన్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మళ్లీ ఆ వస్తువులు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయో ? అసలు రావో అనే సందేహంతో ముందస్తు కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రష్యా మార్కెట్‌లో వెస్ట్రన్‌ వస్తువులకు గిరాకీ పెరిగింది. దీనికి తగ్గట్టే బ్లాక్‌ మార్కెట్‌ కూడా పుంజుకుంది.

ఉదాహారణకు పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్‌ అందించే మెక్‌డొనాల్డ్‌ రష్యాతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతే మెక్‌డొనాల్డ్స్‌ పిజ్జాలు, బర్గర్లను ఆఖరిసారి రుచి చూద్దామనుకుంటున్న రష్యన్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో గంటల తరబడి స్టోర్ల దగ్గర నిలబడి డొనాల్డ్‌ రుచులు ఆరగిస్తున్నారు.

మరికొందరు పెరిగిన డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. భారీ ఎత్తున మెక్‌డొనాల్డ్స్‌ ఉత్పత్తులు కొని తమ ఇళ్లలోని ప్రిడ్జ్‌లలో నింపేస్తున్నారు. వాటిని పదింతల ధరలకు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఇండిపెండెండ్‌ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం మెక్‌డొనాల్డ్‌ బిగ్‌బర్గర్‌ ధర 4,000 రూబుల్స్‌ (రూ. 2,300), సాఫ్ట్‌ డ్రింగ్‌, ఫ్రైస్‌తో కూడిన మీల్‌ ధర 250 పౌండ్లు (రూ.24,942)లుగా ఉంది. ఆఖరికి మెక్‌డొనాల్డ్‌ సిగ్నేచర్‌ లోగో ఉన్న అద్దాన్ని అమ్మకానికి పెట్టగా 75 యూఎస్‌ డాలర్ల (రూ.5,750)కి అమ్ముడైంది.

చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement