రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త

RuPay card users can avail up to 65pc  discount on various purchases: NPCI  - Sakshi

 రూపే బంపర్ ఆఫర్లు, ఫెస్టివ్‌ కార్నివాల్‌

సాక్షి, ముంబై:  ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్‌ కార్నివాల్‌’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్‌సంగ్‌ వంటి టాప్‌ బ్రాండ్‌లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్‌ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్‌ డెలివరి, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, వెల్‌నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్‌ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్‌సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్‌  ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్‌పీసీఐ మార్కెటింగ్‌ చీఫ్‌ కునాల్‌ కలవాతియా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top