ఓఎన్‌జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ

Rs 3740 crore ONGC project to boost Mumbai High output - Sakshi

చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంపు

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్‌ టన్నుల చమురు, 1 బిలియన్‌ ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్‌ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్‌–8 మార్జినల్‌ ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top