ఆర్‌ఐఎల్‌ చేతికి శుభలక్ష్మీ పాలి

RIL Acquires Shubhalakshmi Polyesters For Rs 1592 Crores Deal - Sakshi

డీల్‌ విలువ రూ. 1,592 కోట్లు

న్యూఢిల్లీ: పాలియెస్టర్‌ చిప్స్, యార్న్‌ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్‌(ఎస్‌పీఎల్‌)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్‌ పాలియెస్టర్‌ లిమిటెడ్‌ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్‌ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్‌ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది.

తాజా కొనుగోలు ద్వారా టెక్స్‌టైల్‌ తయారీ బిజినెస్‌ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్‌పీఎల్‌ పాలియెస్టర్‌ ఫైబర్, యార్స్, టెక్స్‌టైల్‌ గ్రేడ్‌ చిప్స్‌ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్‌ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: ఐటీ జాబ్‌ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top