ఐటీ జాబ్‌ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

Want To Get A Job In Google,these Things Should Be Dont Write On Your Resume In 2022 - Sakshi

గూగుల్‌లో జాబ్‌ సంపాదించడమే మీ లక్ష్యమా? గూగుల్‌తో పాటు ఇతర టెక్‌ కంపెనీల్లో ఐసైతం జాబ్‌ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ రెజ్యూమ్‌లో ఇలాంటి తప్పులు చేయకండి. గూగుల్‌ రిక్రూటర్‌ చెప్పిన ఈ టిప్స్‌ ఫాలో అయితే దిగ్గజ కంపెనీల్లో జాబ్‌ సంపాదించడం అంత కష్టం కాదని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుందామా! 

మీరు కోరుకున్న డ్రీమ్‌ జాబ్‌ పొందడంలో రెజ్యూమ్‌ కీరోల్‌ ప్లే చేస్తోంది. చాలా మంది జాబ్‌ కోసం ట్రై చేస్తున్న వారికి సంస్థలు రెజ్యూమ్‌ను కేవలం వ్యక్తిగత వివరాల్ని తెలుసుకునేందుకు  ఉపయోగపడుతుందని అనుకుంటారు.కానీ అందులో వాస్తవం లేదని, అభ్యర్ధి తెలివితేటలకు పరీక్ష పెడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీ రెజ్యూమ్‌ను అర్హతలకు అనుగుణంగా తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఒకవేళ మీరు గూగుల్‌ లేద ఇతర దిగ్గజ కంపెనీల్లొ జాబ్‌ కొట్టాలంటే రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకూడదని గూగుల్‌ రిక్రూటర్‌ ఒకరు టిక్‌టాక్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

చికాగోకు చెందిన గూగుల్‌ సీనియర్ రిక్రూటర్ ఎరికా రివెరా టిక్‌ టాక్‌లో మీ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చేలా పలు సూచనలు చేశారు.ఆ వీడియోను 2మిలియన్ల మంది యూజర్లు వీక్షించగా..ఆ వీడియోలో ఎరికా..తాను ఇప్పటి వరకు వేలాది వెబ్‌ సైట్‌లను స్క్రీనింగ్‌ చేసినట్లు చెప్పారు. అభ్యర్ధులు వారి రెజ్యూమ్‌లో అసందర్భమైన డేటాను పొందుపరిచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అలా సందర్భం లేని ఇన్ఫర్మేషన్‌ రెజ్యూమ్‌లో ఉండకూడదన్నారు.  

రెజ్యూమ్‌లో అభ్యర్ధులు పూర్తి అడ్రస్‌ను చేర్చాల్సిన పనిలేదని చెప్పారు. నగరం, లేదా రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. 

సీవీలో చేర్చగూడని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మీకు వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండొచ్చు. కానీ ఆ విషయం మొత్తంలో సీవీలో ప్రస్తావించకూడదు. మీరు ఏ సంస్థకి ఇంటర్వ్యూకి, ఏ రోల్‌ జాబ్‌ ఇంటర్వ్యూకి వెళుతున్నారో..ఆరోల్‌కు అనుగుణంగా రెజ్యూమ్‌ను తయారు చేసుకోవాలని సూచించారు.  

రెజ్యూమ్‌లో మీరు గతంలో పనిచేసిన సంస్థ గురించి ప్రస్తావిస్తూ..ఆ సంస్థలో సాధించిన విజయాల గురించి ఒక టీం చేసిన విధంగా చెప్పాలి. అంతే తప్పా అన్నీ నేనే చేశాను అని మాత్రం ప్రస్తావించకూడదు. 

రెజ్యూమ్‌లో సంబంధం లేకుండా రెఫరెన్స్‌ నేమ్స్‌, వారి వివరాల్ని పొందుపరుస్తుంటారు.అలాంటి విషయాలు అవసరం లేదని ఎరికా టిక్‌ టాక్‌ వీడియోలో చెప్పారు.రిక్రూటర్లకు అవసరం అయితే మిమ్మల్ని అడుగుతారని, అంతే తప్పా మీరే స్వయంగా చెప్పకూడదని అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top