రియల్ మీతో జత కట్టిన జియో

Reliance Jio To Tie Up With Realme and Others to Make 4G Device - Sakshi

రిలయన్స్ జియో రియల్ మీ, ఇతర కంపెనీలతో కలిసి 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారీ ఒకరు తెలిపారు. తక్కువ ధరకు 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే 5జీ నెట్ వర్క్ అనుగుణంగా ఫోన్ల తయారీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి దేశంలో చాలా మంది 2జీ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ తెలిపారు. త్వరలో వీరి కోసం చాలా తక్కువ ధరలో 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: 10 బెస్ట్ ఇంటర్నెట్ టిప్స్  మరియు ట్రిక్స్)

4జీ మొబైల్స్ ని తీసుకురావడంకోసం రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు, ఇతర పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ తెలిపారు. రియల్‌ మీ సీఈఓ మాధవ్‌ శేత్‌ మాట్లాడుతూ.. దేశంలో త్వరలో తక్కువ ధరలో 5జీ మొబైల్స్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మొబైల్స్ ని తీసుకురావడానికి చిప్‌సెట్‌లు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన అన్నారు. మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ డిజిటల్ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు. రానున్న రోజుల్లో 5జీ సహాయంతో క‌ృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం రాబోతుందని తెలిపారు. 2021 వరకు భారత దేశంలో 5జీ సేవలు అందబోతున్నాయని, దానికి అనుగుణంగా సాంకేతికతతో కూడిన సెల్‌ఫోన్ పరికరాలను తయారు చేస్తామని ప్రకటించారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top