Reliance Jio: రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..?

Reliance Jio And Zupee Announce Strategic Partnership - Sakshi

యూజర్లకు మరిన్నీ సేవలను అందించేందుకుగాను రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా,మ్యూజిక్‌, క్లౌడ్‌, హెల్త్‌, యూపీఐ లాంటి సేవలను జియో తన యూజర్లకు అందిస్తోంది. వీటితో పాటుగా మరిన్నీ గేమింగ్‌ సేవలను అందించేందుకు జియో సన్నాద్ధమైంది. 

జూపీ(Zupee)తో కీలక ఒప్పందం..!
స్కిల్డ్‌ బేస్డ్‌ గేమింగ్‌ రంగంలో ప్రసిద్ధి చెందిన జూపీతో రిలయన్స్‌ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో జియో కస్టమర్లకు క్వాలిటీ గేమ్స్‌ అనుభూతిని పొందే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యంతో జియో తన యూజర్లు జూపీకి చెందిన అన్నీ గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చును. ఈ గేమ్స్‌ అన్ని భాషలను సపోర్ట్‌ చేయనున్నాయి.

రిలయన్స్‌ జియో-జూపీ భాగస్వామ్యంతో జూపీ సేవలు మారుమూల గ్రామాలకు చొచ్చుకుపోతాయని  జూపీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దిల్షేర్ సింగ్ అన్నారు. ఇప్పటికే తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో సుమారు 70 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ను కల్గి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో యూజర్లు గేమ్స్‌ను యాక్సెస్‌ చేసే అవకాశం ఏర్పడనుంది. 

600 మిలియన్‌ డాలర్లకు..
సిరీస్‌ బీ రౌండ్‌ ఫండింగ్‌లో నేపియన్‌ క్యాపిటల్‌, వెస్ట్‌ క్యాప్‌ గ్రూప్‌, టోమల్సె బే క్యాపిటల్‌, ఏజే క్యాపిటల్‌, మాట్రిక్స్‌ పాట్నర్స్‌ ఇండియా, ఒరిస్‌ వెంచర్‌ నుంచి జూమీ సుమారు 102 మిలియన్‌ డాలర్లను సేకరించింది. గేమింగ్‌ రంగంలో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, ఆయా గేమింగ్స్‌ డిజైన్ అనుభవాలను మెరుగుపరచడానికి,  మార్కెటింగ్ పలు ఇతర విషయాల్లో ఈ నిధులను ఉపయోగిస్తామని జూపీ పేర్కొంది. కంపెనీ విలువ ఇప్పటివరకు 600 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్‌.. స్టార్టప్‌లకు మంచి రోజులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top