రెడ్‌మి 12సీ, రెడ్‌మి నోట్‌12 వచ్చేశాయ్‌! అందుబాటు ధరలే

Redmi Note12 4G Redmi 12C with launched in India check details - Sakshi

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌కు షావోమి రెడ్‌ మి 12 సిరీస్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. గత వారం యూరప్‌లో విడుదల చేసిన రెడ్‌మినోట్‌12  4జీతోపాటు, రెడ్‌మి12 సీనిక ఊడా  ఇపుడు  భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్‌మినోట్‌12  4జీ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది  

రెడ్‌మినోట్‌12  4జీ ధర ,  లభ్యత
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్  ధర రూ.14,999గా ఉంది. 
లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ  సన్‌రైజ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం.  అలాగే లిమిటెడ్‌ ఆఫర్‌ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్‌, ఇతర  రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయంజ

రెడ్‌మినోట్‌12  4జీ స్పెసిఫికేషన్స్
6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్‌ప్లే |
2400 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌
Qualcomm Snapdragon 685 చిప్‌సెట్
Android 13 ఆధారంగా MIUI 14
50+ 8+ 2ఎంపీ  ట్రిపుల్ రియర్ కెమెరా 
13ఎంపీ సెల్ఫీ కెమెరా
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు  5,000mAh బ్యాటరీ

రెడ్‌మి 12 సీ  స్పెసిఫికేషన్స్
6.71-అంగుళాల HD+ డిస్‌ప్లే  
MediaTek Helio G85 SoC
ఆండ్రాయిడ్ 12 OS
50 + 2 ఎంపీ రియర్‌ డ్యూయల్ కెమెరాలు
5ఎంపీ సెల్ఫీ  కెమెరా
5,000W బ్యాటరీ

రెడ్‌మి 12 సీ లభ్యత,ధరలు
4జీబీ ర్యామ్‌  + 64జీబీ స్టోరేజ్‌ ధర :  రూ. 8,999
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999
ఏప్రిల్‌  ‌16నుంచి  కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.  బ్యాంక్ కార్డ్‌తో 500 తక్షణ తగ్గింపు

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top