వృద్ధికి ఊతం.. ప్రైవేటు వినియోగం

Private consumption, rural demand to drive India growth - Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో గ్రామీణ డిమాండ్‌ పునరుద్దరణ– ఆర్‌బీఐ ఆర్టికల్‌

ముంబై: దేశీయ వృద్ధికి ప్రైవేటు వినియోగం ఊతం ఇస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్టికల్‌ ఒకటి పేర్కొంది. ఆయా అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) గ్రామీణాభివృద్ధి, తయారీ రంగాల పునరుద్ధరణకు ఊతం ఇస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అభిప్రాయాలగా పరిగణించకూడని ఈ ఆర్టికల్‌ ‘‘ప్రస్తుత ఎకానమీ పరిస్థితి’’ పేరుతో సెంట్రల్‌ బ్యాంక్‌ బులిటెన్‌లో ప్రచురితమైంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. నివేదిక పేర్కొన్న మరిన్ని అంశాలను పరిశీలిస్తే..

చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!

► అంతర్జాతీయ మందగమనం,  అధిక ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గాయి. బ్యాంకింగ్‌ నియంత్రణ, పర్యవేక్షణల్లో మెరుగుదల నమోదయ్యింది.   గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది.  
► ఇక దేశీయంగా చూస్తే 2023 మే తొలి భాగంలో ఆర్థిక సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రెవెన్యూ వసూళ్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.  
► ఆర్‌బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌ 5 శాతం దిగువకు వచ్చింది. కార్పొరేట్‌ ఆదాయాలు ఆదాయాలకు మించి నమోదయ్యాయి.  
► బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగాలు కూడా ఆదాయాల విషయంలో మంచి పనితీరును కనబరిచాయి. రుణ వృద్ధి పెరిగింది. 

మరిన్ని బిజినెస్‌ వార్తలు, అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top