వైద్య రంగంలో డిజిటలైజేషన్‌కు తెరతీసిన కోవిడ్‌ - ప్రాక్టో

Practo: Digitalization Process In Health Sector Speedup Due To Covid - Sakshi

దేశీయ వైద్య రంగంలో డిజిటలైజేషన్‌ బాగా పెరిగినట్టు ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ ప్రాక్టో నివేదిక వెల్లడించింది. ’కోవిడ్‌–19ని అర్ధం చేసుకోవడం–భారతదేశంలోని మూడు వేవ్స్‌ను పోల్చడం’ అనే పేరుతో చేసిన తాజా అధ్యయనం తాలూకు నివేదికలో కోవిడ్‌ కాలం నాటి పలు అంశాలను విశ్లేషించారు.  

 ఈ నివేదిక వెల్లడించిన కొన్ని విశేషాలు..
– మూడు కోవిడ్‌ వేవ్స్‌ సమయంలో రోజుకు ఆ¯Œన్‌లైన్‌లో డాక్టర్‌తో రోగి గడిపిన సగటు సమయం 30 నిమిషాలు
- గత రెండేళ్లలో, కోవిడ్‌–19 నిర్వహణలో డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ముఖ్యమైన పాత్ర పోషించింది
 - మొత్తం ఆన్‌లైన్‌ సంప్రదింపులలో 70 శాతం కోవిడ్‌  గురించే సాగాయి. 
–సెకండ్‌వేవ్‌ టైమ్‌లో  ఆన్‌లైన్‌ సంప్రదింపులు గరిష్టంగా 690 శాతం పెరిగాయి. 
– మొత్తం టెలిమెడిసిన్‌ వినియోగదారులలో 57 శాతం మంది మొదటి వినియోగదారులే. 
– మొత్తం ఆన్‌లైన్‌ సంప్రదింపులలో 54 శాతం మిలీనియల్స్, జెడ్‌ఎస్‌ నుంచి వచ్చినవి
– ఆయుర్వేదం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యంలో 50 శాతం వృద్ధి నమోదైంది.
– డెంటల్, సైకియాట్రీ, సెక్సాలజీ వంటి స్పెషాలిటీలు వ్యక్తిగత నియామాకాలలో పెరుగుదల సాధించాయి. 
– డోలో 650 ఎంజి, జింకోవిట్, లిమ్సీ 500 ఎంజీ, అజీ 500ఎంజీ, పాన్‌డి మందులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు. 
– కోవిడ్‌–19 స్వాట్‌ పరీక్ష, పూర్తి రక్త గణన పరీక్ష, థైరాయిడ్‌ ప్రొఫైల్‌లు ఎక్కువగా  ఆర్డర్‌ చేసిన రోగనిర్ధారణ పరీక్షలు

మెట్రో నగరాల వారీగా...
– మూడవ వేవ్‌లో మొత్తం కోవిడ్‌ సంప్రదింపులలో 32 శాతం బెంగళూరు నుంచే వచ్చాయి. 
– రెండవ వేవ్‌ సమయంలో ఢిల్లీ నుండి అత్యధిక సంప్రదింపులు వచ్చాయి, 
– మూడు వేవ్స్‌లో అత్యధిక ఆన్‌లైన్‌ సంప్రదింపులు చేసిన నగరాలలో హైదరాబాద్‌ మూడవది
– మొదటి వేవ్‌ సమయంలో, ముంబై అత్యధిక ఆన్‌లైన్‌ కోవిడ్‌ సంప్రదింపులకు వేదికైంది.

చదవండి: ఓపెన్‌ మార్కెట్‌లో కోవిషీల్డ్‌ బూస్టర్‌ డోస్‌.. ధర ఎంతంటే ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top