Pirated Sites: బందిపొట్లే... కానీ సంపాదనలో బడాబాబులే

Pirated Entertainment Sites Are Making Billions From Ads - Sakshi

సినిమా ఒక మాస్‌ కమ్యూనికేషన్‌..! ఒక విషయాన్ని వివరించడంలో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసే మాధ్యమం సినిమా. ఎంతో మందికి అన్నం పెడుతూ..ప్రేక్షకులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించడంలో సినిమా పాత్ర ఎనలేనిది. రకరకాల సినిమాలు నవరసాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడు ముందుంటాయి. ఎంటరైన్‌మెంట్‌ రంగంలో సినిమాకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. పెరుగుతున్న సాంకేతికతో సినిమా కూడా కొంతపుంతలను తొక్కుతుంది.

సాంకేతికతో భారీ చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందిస్తూనే ప్రేక్షకులచే  ఔరా..! అనిపిస్తున్నాయి ఇప్పటి సినిమాలు. సాంకేతికతో సినిమాలు తీసే విధానం పూర్తిగా మారగా..అదే సాంకేతికత సినిమాల కొంప ముంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కోటున్న పెద్ద సవాలు పైరెసీ భూతం. పైరసీ చేయడంతో ఆయా సినిమాలో కోసం పనిచేసిన వారి కష్టం బూడిదపాలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇతర చిత్ర పరిశ్రమలు పైరసీ భూతాన్ని ఎదుర్కొంటున్నాయి.

పైరసీ భూతం సంపాదన ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
సినిమాలను పైరసీ చేసే​ పైరేటెడ్‌ సైట్ల ఆదాయం ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్‌ అవ్వాల్సిందే. సినిమాలు, ఇతర టీవీ షోలను పైరసీ చేయడం ద్వారా ఆయా పైరేటెడ్‌ సైట్లు ప్రతి సంవత్సరం సుమారు 1.3 బిలియన్‌ డాలర్లు (రూ. 9,660 కోట్లు.). ఇది కేవలం పైరేటెడ్‌ సైట్లకు  యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే. పైరేటెడ్‌ సైట్లకు పోర్న్‌, ఇతర కంపెనీలు ఆదాయాన్నిచ్చే సంస్థలుగా నిలుస్తున్నాయి. కాగా యాడ్స్‌ కేవలం వాటి నుంచే వస్తున్నాయంటే పొరపడినట్లే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి సంపాదించిన ఈ-కామర్స్‌ సైట్లు కూడా పైరేటెడ్‌ సైట్లకు ఆదాయమార్గాలుగా ఉన్నాయి.

పైరేటెడ్‌ సైట్లకు ప్రధాన కంపెనీ బ్రాండ్‌లు సుమారు నాలుగు శాతం మేర యాడ్‌ రెవెన్యూను అందిస్తున్నాయి. ఇవే ప్రధాన కంపెనీ బ్రాండ్స్‌ పైరేట్‌డ్‌ యాప్‌లకు 24 శాతం మేర ఆదాయాన్ని జనరేట్‌ చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల్లో గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి సైట్లు కూడా ఉన్నాయి. పైరసీ ద్వారా సినిమాలను చూసే వారికి కూడా కచ్చితంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 84 వేల పైరేటెడ్‌ సైట్లు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. పైరేటెడ్‌ సైట్లను నియంత్రిచడంలో ప్రధాన కంపెనీలు కీలక పాత్ర వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.  ఆయా పైరేటెడ్‌ సైట్ల ఐపీలకు యాడ్స్‌ను కల్పించకుండా ఉంటే సైట్లకు రెవెన్యూ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top