కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్‌కి వెళ్లి పనిచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దేశీయ దిగ్గజ కంపెనీలు పర్మినెంట్‌గా ఇంటి వద్ద నుంచి పనిచేసేలా బంపరాఫర్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరి స్పష్టం చేసింది.
కోవిడ్ కారణంగా వర్క్ కల్చర్ ఆఫీస్‌నుంచి ఇంటికి మారింది. కానీ గత కొద్దిరోజులుగా పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాల్లో పని చేయాలని చెప్పినట్లే చెప్పి మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, అవసరం అయితే ఉద్యోగుల్ని ఐబ్రిడ్ వర్క్‌కి ఆహ్వానిస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జాబ్ పోర్ట్ నౌకరి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత 6నెలల్లో నౌకరిలో ప్రకటనలిస్తున్న దిగ్గజ కంపెనీలు శాశ్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులకోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
►నౌకరి వెబ్ పోర్టల్‌లో మనదేశానికి చెందిన సుమారు 32 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాల కోసం అన్వేషించినట్లు నౌకరి తెలిపింది. అందులో దాదాపు 57శాతం మంది అభ్యర్ధులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెతికినట్లు వెల్లడించింది.
►నౌకరి తన జాబ్ బోర్డ్‌లో ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించిన తర్వాత, తన సైట్‌లో 93,000 శాశ్వత, తాత్కాలిక రిమోట్ ఉద్యోగాల్ని ప్రకటించాయని, పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 22శాతం ఉన్నాయి.
►మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా వర్క్ కల్చర్ మారిపోయింది. కార్పోరేట్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగుల్ని హైబ్రిడ్ వర్క్ కల్చర్ కి దగ్గర చేయాలని భావిస్తున్నాయి.
►రిక్రూటర్‌లు ఉద్యోగుల ఎంపిక, వారి పని విధానం విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది రిక్రూటర్లు పనితీరు కనబరిచే ఉద్యోగుల కోసం అన్వేషణ, ఎక్కడి నుండైనా పని చేసేందుకు అంగీకరిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరాలకు శాశ్వత మార్పులు చేయడం ప్రారంభించారు”అని నౌకరి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోయల్ అన్నారు.
►అంతేకాకుండా, కంపెనీలు కొన్ని జాబ్ ప్రొఫైల్‌లను పర్మినెంట్ వర్క్ హోమ్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, బీపీఓ వంటి రంగాల్లో ఈతరహా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.
►పెద్ద, చిన్న కంపెనీలు రెండూ మూడు రకాల ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. వాటిలో సాధారణ ఉద్యోగాలు, తాత్కాలిక వర్క్ ఫ్రమ్ హోమ్, శాస్వతంగా రిమోట్ వర్క్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి.
►ఐటీ సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలు, ఐటీఈఎస్, రిక్రూట్‌మెంట్/సిబ్బంది రంగాలు ఎక్కువ శాశ్వత రిమోట్ ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయని నౌకరీ డేటా చూపుతోంది.
►నౌకరీ డేటా ప్రకారం అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్, పిడబ్ల్యుసి, ట్రిజెంట్, ఫ్లిప్‌కార్ట్, సిమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్, టీసీఎస్, క్యాప్‌జెమినీ తాత్కాలిక, శాశ్వత రిమోట్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment