ఒప్పో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ | Oppo sets up first 5G innovation lab in India | Sakshi
Sakshi News home page

ఒప్పో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

Dec 22 2020 4:56 PM | Updated on Dec 22 2020 5:02 PM

Oppo sets up first 5G innovation lab in India - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో  ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తోంది.

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో  ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తోంది. చైనా  తరువాత , భారతదేశంలోని​ హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ అని కంపెనీ  ప్రకటించింది. అంతేకాదు నూతన ఆవిష్కరణలతోపాటు,  భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేలక్ష్యంలో​ భాగంగా మరో మూడు ఫంక్షనల్‌  ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్‌ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో  తమ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌  కేంద్రంలో 5జీ ఇన్నేవేషన్‌ ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నామనీ, విదేశాల్లో ఇది మొదటిదని ఒప్పో తెలిపింది. అలాగే అత్యాధునిక ఆవిష్కరణ పనుల కోసం కెమెరా, పవర్, బ్యాటరీ పనితీరు మెరుగుపర్చేలా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని  పేర్కొంది. తద్వారా 5 జీ యుగానికి కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి,  మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి  చేస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఇండియా 5జీ ప్రయాణంలో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తస్లీమ్ ఆరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement