అదిరిపోయే టెక్నాలజీ తీసుకొచ్చిన ఒప్పో

Oppo Introduces New Slide Concept Phone with Three Hinges - Sakshi

చైనా: మొబైల్ తయారీదారులు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీనీ తీసుకొస్తున్నారు. ఇప్పటీకే శామ్‌సంగ్ వంటి సంస్థలు మడతపెట్టే ఫోన్లను తీసుకొస్తుండగా. ఎల్జీ, షియోమీ వంటి సంస్థలు కూడా కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో ఒప్పో కూడా స్లైడ్-ఫోన్ టెక్నాలజీ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో జపాన్ కు చెందిన నెండో సంస్థతో కలిసి నాల్గవ చైనా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ డిజైన్ ఎక్స్‌పో (సిఐఐడిఇ)లో ఈ స్లైడ్-ఫోన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. (చదవండి: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో

 

ఈ ‘స్లైడ్-ఫోన్’ చూడటానికి ట్రిపుల్-హింజ్ ఫోల్డబుల్ స్క్రీన్ తో ఉండి, పొడవుగా కనిపిస్తుంది. దీనిని పూర్తిగా మడిచినప్పుడు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. మూడు మడతల్లో భాగంగా ఒక్కో మడతను ఓపెన్ చేసిన ప్రతిసారి స్క్రీన్ పరిమాణం 40 మిమీ పెరుగుతుంది. మొదటి స్క్రీన్ స్లైడ్ చేస్తే మీకు నోటిఫికేషన్‌లు, కాల్ హిస్టరీ, మ్యూజిక్ ప్లేయర్ వంటి వాటిని మనం గమనించవచ్చు. రెండవ సారి స్క్రీన్ స్లైడ్ చేస్తే సెల్ఫీలు తీసుకోవటానికి 80 మి.మీ డిస్‌ప్లే పరిమాణంలో తెరుచుకుంటుంది. మొత్తం స్క్రీన్‌ను స్లైడ్ చేస్తే మీకు గేమింగ్, మల్టీ-టాస్కింగ్ లేదా వీడియోలను చూడటానికి స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ పరిమాణాన్ని సగం వరకు తగ్గించవచ్చు. అలాగే ఈ మొబైల్ కి ఒకవైపు మ్యూజిక్ ప్లే/స్టాప్ ,మ్యూట్, వాల్యూమ్ షట్టర్ వంటి బటన్లు ఉన్నాయి. ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాధారణ ఛార్జింగ్ తో పాటు దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు ఒప్పో విడుదల చేసిన వీడియోలో తెలుస్తుంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top