5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!

Oppo A93 5G announced with Snapdragon 480 Processor - Sakshi

ఒప్పో ఏ93 5జీ మొబైల్ ను చైనాలో ప్రారంభించింది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ ను తీసుకొచ్చింది. ఒప్పో మొదటిసారిగా బడ్జెట్ మొబైల్స్ లో 5జీ కనెక్టివిటీ తీసుకురావడం విశేషం. ఈ మొబైల్ ప్రధాన కెమెరా సామర్ధ్యం 48 మెగాపిక్సెల్. అలాగే ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది రెండు స్టోరేజ్ మోడల్స్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.(చదవండి: శామ్‌సంగ్ నుంచి మరో పవర్ ఫుల్ ప్రాసెసర్)

ఒప్పో ఏ93 ఫీచర్స్: 
ఒప్పో ఏ93 5జీ మొబైల్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్(1,080x2,400) ఎల్‌సిడి డిస్‌ప్లే, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ స్క్రీన్ ‌తో వస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌తో పాటు 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఒప్పో ఏ93 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.7 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు + వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

ఒప్పో ఏ93 5జీ కనెక్టివిటీ విషయానికి వస్తే 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, వై-ఫై, యుఎస్ బి టైపు సీ పోర్టు ఉన్నాయి. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. చైనాలో దీని  8జీబీ+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,999 (సుమారు రూ.22,500)యువాన్లుగా ఉంది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ సిల్వర్, బ్లాక్, అరోరా కలర్ ఆప్షన్లలో లభించనుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top