OnePlus Diwali Head Start Sale 2022: వ‌న్‌ప్ల‌స్ కళ్లు చెదిరే డీల్స్‌, ఆఫర్లు

OnePlus Diwali Head Start Sale 2022: Deals offers and more - Sakshi

సెప్టెంబ‌ర్ 22 నుంచి సేల్‌

 టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై  తగ్గింపు ధరలు

సాక్షి,ముంబై: ఫెస్టివ్‌ సీజ‌న్‌లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబ‌ర్ 23 నుంచి డిస్కౌంట్‌సేల్‌కు తెరలేవనుంది. మ‌రోవైపు  చైనీస్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ దిగ్గ‌జం వ‌న్‌ప్ల‌స్ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబ‌ర్ 22 నుంచి దివాలీ సేల్‌ను ప్రారంభిస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌లు, టీవీఎస్‌ ఇయర్‌బడ్‌లు, టీవీలు, మరిన్నింటిపై డిస్కౌంట్లులభ్యం. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్లు  6వేల వరకు తక్షణ తగ్గింపును పొందగలరు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌కూడా అందిస్తోంది. అంతేకాకుండా, దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022 వన్‌ప్లస్ ఉత్పత్తుల కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్‌లను కూడా అందిస్తుంది. అలాగే వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఫ్లిప్ అండ్ విన్ ఛాలెంజ్ కూడా ఉంది.

ఈ సేల్‌లో ముఖ్యంగా వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొను రూ 55,999 కి విక్ర‌యిస్తోంది. దీని లాంచింగ్‌ ధర రూ 66,999. అంటే రూ 11,000 డిస్కౌంట్‌ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫ‌ర్‌తో పాటు డిస్కౌంట్‌ల‌తో క‌లిపి ఈ మొత్తం త‌గ్గింపును కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. అలాగే వ‌న్‌ప్ల‌స్ 10ఆర్‌ 5జీ 29,999లకే అందించనుంది. ఎంఆర్‌పీ ధర 34,999. అలాగే వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌ 2టీ 5జీ ఫోన్‌నరెండవేల తగ్గింపుతో రూ. 26,999కే విక్రయించ నుంది.

దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ల‌తో స్మార్ట్‌ఫోన్లు, అలాగే టీవీలు ఇతర ఉత్పత్తులను మ‌రింత త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబ‌ర్ 22 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top