Ola Store: మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఓలా!

Ola Begins Pilot of Quick Grocery Delivery Service in Bengaluru - Sakshi

ప్రముఖ క్యాబ్‌ సర్వీసు సంస్థ ఓలా మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన రంగంలో అదృష్టం పరీక్షించుకుంటున్న ఓలా, ఇప్పుడు సరకుల డెలివరీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దపడుతుంది. బెంగళూరులో కిరాణా, వ్యక్తిగత సంరక్షణ, పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తులు వంటి వస్తువుల డెలివరీ సేవలను అందించేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఓలా బెంగళూరులో తన 'ఓలా స్టోర్' పైలట్ ప్రాజెక్టును కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రారంభిస్తుందని, తర్వాత రాబోయే నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించనున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. 

ఈ సేవలను వేగంగా అందించడానికి 15 నిమిషాల డెలివరీ టైమ్ లైన్'ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంమై ఓలా సంప్రదించినప్పుడు దీనిపై మాట్లాడటానికి నిరాకరించింది. ఓలా యాప్‌లోనే ఓలా స్టోర్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,000 సరకులు అందిస్తున్నట్లు సమాచారం. నగరంలోని కీలక ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న దుకాణాల నుంచి వీటిని పంపిణీ చేస్తామని ఆ వర్గాలు తెలిపాయి. సంప్రదాయ ఈ-కామర్స్ డెలివరీలకు ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.

(చదవండి: ముఖేష్‌ అంబానీ కొత్త ఇల్లు..! ఎంత‌కు కొనుగోలు చేశారో తెలుసా..!)

క్విక్ కామర్స్(క్యూ కామర్స్) కస్టమర్లకు తక్కువ వ్యవధిలో చిన్న మొత్తంలో వస్తువులను అందించాలని ఓలా ఆలోచిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో డుంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వంటి సంస్థలు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. రెడ్‌సీర్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో 0.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న క్యూ-కామర్స్‌ పరిశ్రమ విలువ 2025 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందే అవకాశం ఉంది అని అంచనా. ఎఎన్ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఓలాలో ఫుడ్ డెలివరీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేయడానికి వీలుగా ఇటీవల ఓలా కార్స్అనే వాహన వాణిజ్య వేదికను కూడా ప్రారంభించింది. 

(చదవండి: సామాన్యులకు షాక్.. ఇక ఉచిత రేషన్ బంద్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top