ఇంట్లో నుండే ఆధార్ అప్‌డేట్ చేసుకోండి ఇలా!

Now You Can Change Aadhar Important Details in Online - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మనకి ఇంటి నుండి బయటకి వెళ్లాలంటే భయం వేస్తుంది. ఏదైనా ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వాల కార్యాలయాలకు వెళ్లాలంటే మరి ఈ భయం ఎక్కువగా ఉంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇప్పుడు మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించకుండా మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, భాషను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు అని యుఐడీఎఐ ఒక ట్వీట్‌లో పేర్కొంది. మిగతా సేవల అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రాన్ని సందర్శించాలి అని తెలిపింది.(చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త!)

ఇలా అప్డేట్ చేసుకోండి.. 
స్టెప్ 1: ఆధార్ కార్డ్ యొక్క అధికారిక వెబ్‌సైట్(uidai.gov.in)‌ను సందర్శించండి. 
స్టెప్ 2: మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: తర్వాత 'ప్రొసీడ్ టూ అప్‌డేట్ ఆధార్'ని ఎంచుకోండి.
స్టెప్ 4: ఇప్పుడు మీ ఆధార్ ధార్ కార్డు నంబర్‌, కాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి.  
స్టెప్ 5: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.   
స్టెప్ 6: ఇప్పుడు మీకు కనిపించే 'అప్‌డేట్ డామోగ్రాఫిక్ డేటా' సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 7: తర్వాత ట్యాబ్ లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. 
స్టెప్ 8: ఇప్పుడు పైన చెప్పిన వాటిలో మీరు నవీకరించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి.
స్టెప్ 9: అన్ని వివరాలను నింపిన తరువాత, ఐడిని అడ్రస్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాలి. దీన్ని ఏ ఫార్మాట్‌లోనైనా పీడీఎఫ్, జేపిఇజి లేదా పీఎన్‌జీలో అప్‌లోడ్ చేయవచ్చు.
స్టెప్ 10: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 50 ఆన్‌లైన్ చెల్లించండి.
స్టెప్ 11: ఆన్‌లైన్ చెల్లింపు విజయవంతం అయ్యాక మీకు వెంటనే నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌కు URN కోడ్ వస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top