మెరుగ్గానే రిటైల్‌ రుణ వసూళ్లు

no impact from interest rate hikes inflation on Retail loans Says crisil - Sakshi

వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం లేదు 

క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడి  

ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్‌ రిటైల్‌ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. తాను రేటింగ్‌ ఇచ్చే సెక్యూరిటైజ్డ్‌ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్‌ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్‌ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది.

ఆర్‌బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్‌లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్‌గేజ్‌ ఆధారిత సెక్యూరిటైజేషన్‌ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో 105 శాతంగా ఉంటే, అవి జూన్‌ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్‌ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్‌ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది.       

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top