‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Nitin Gadkari Crusial Comments On Petrol Price - Sakshi

జీఎస్‌టీలోకి తెస్తే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గుతాయ్‌ 

రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి   

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గగలవని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పకుండా వీటిని జీఎస్‌టీలోకి చేర్చేందుకు ప్రయత్నించగలరని గడ్కరీ చెప్పారు. 

‘జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు‘ అని బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంపై స్పందిస్తూ.. సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top