న్యూ ఇయర్‌ ఆఫర్‌ అదరహో.. ఎయిర్‌టెల్‌ యూజర్లుకు 50జీబీ డేటా ఫ్రీ!

New Year Offer: Airtel Free Data With Wynk Premium Plan - Sakshi

కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా న్యూ ఇయర్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ వినియోగదారుల కోసం ఉచితంగా 50 జీబీ డేటా (Data) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్రీ డేటా ఆఫర్‌ పొందాలనుకున్న కస్టమర్లు ఏం చేయాలంటే..

ఎయిర్‌టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకుని వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే..  యాడ్స్‌ లేకుండా మ్యూజిక్‌ ఎంజాయ్ చేయడం,  డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఈ ఆఫర్‌ ఎలా పొందాలంటే.. ఎయిర్‌టెల్‌ యూజర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజులు తీసుకుంటే వారి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రూ. 98కే ఈ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే మీరు ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ రూ. 301గా ఉంది. గమనించాల్సిన విషయం ఎంటంటే.. ఇక్కడ ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది.

చదవండి: వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయ్‌!

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top