పండక్కి వచ్చేస్తోంది... సరికొత్త రూపంలో హోండా యాక్టివా!

New Variants Of Honda Activa Dio To Launch Ahead Of Festive Season - Sakshi

స్కూటర్‌ విభాగానికి యాక్టివా రూపంలో పవర్‌ని పరిచయం చేసిన హోండా సంస్థ పండక్కి కొత్త కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు మార్కెట్‌లోకి తేబోతుంది.

పండక్కి రిలీజ్‌
ఇటీవల హోండా మోటార్‌ సైకిల్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతున్నట్టు పేర్కొంది. రాబోయే పండగ సీజన్‌లోనే ఈ కొత్త మోడల్స్‌ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఎల్‌ఈడీ సొబగులు
హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్‌లో ప్రస్తుతం 5జీ వెర్షన్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్‌ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్‌లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్‌ వీల్స్‌ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్‌ వీల్స్‌ని పరిచయం చేయనుంది.

డియో నాలుగు వెర్షన్లలో
యాక్టివాతో పాటు హోండా డియోకు సంబంధించి మొత్తం 4 వెర్షన్లను మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇందులో కాంపోజిట్‌కాస్ట్‌ వీల్స్‌, డిజిటల్‌ స్పీడోమీటర్‌, కాంపోసిట్‌కాస్ట్‌వీల్స్‌, 3డి ఎంబ్లెమ్‌ వేరియంట్లలో మార్కెట్‌లోకి తేబోతున్నట్టు తెలుస్తోంది.

110 సీసీ
హోండా త్వరలో మార్కెట్‌లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్‌ రెండింటి ఇంజన్‌ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్‌ సిలిండర్‌గా ఉంది.  యాక్టివా 5జీ 7.68 హెచ్‌పీతో 8,000 ఆర్‌పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్‌పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్‌ చేస్తుంది.

చదవండి : పలు కార్లపై బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించిన హోండా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top