Toyota Aygo X: మార్కెట్లోకి మరో మైక్రో ఎస్‌యూవీ కారు!

New Toyota crossover that can rival Tata Punch - Sakshi

Toyota Aygo X: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా అధికారికంగా తన కొత్త మైక్రో ఎస్‌యూవీ కారు ఐగో ఎక్స్(Aygo X)ను ఆవిష్కరించింది. ఇది గతంలో కొద్ది రోజుల క్రితం మన దేశంలో విడుదల అయిన టాటా మోటర్స్ ‘పంచ్‌’ పోలీకను కలిగి ఉంది. టయోటా ఐగో ఎక్స్ కారును జీఎ-బి ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొంకదించారు. ఈ టయోటా ఐగో ఎక్స్ కారు 3,700 మిమీ పొడవు, 1,740 మిమీ వెడల్పు, 1,510 మిమీ ఎత్తు ఉంది. ఐగో ఎక్స్ తో పోలిస్తే టాటా పంచ్ పొడవు 3,827 మిమీ, వెడల్పు 1,742 మిమీ, ఎత్తు 1,615 మిమీగా ఉంది. ఈ టయోటా ఐగో ఎక్స్ పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంపులు, హెడ్ లైట్లతో పాటు ఎల్ఈడి పగటి పూట రన్నింగ్ లైట్లతో వస్తుంది. 

ఐగో ఎక్స్ ఇంటీరియర్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ తో వస్తుంది. దీని వెనుక 9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంది. టయోటా ఐగో ఎక్స్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో అనుకూలమైన ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. ఐగో ఎక్స్ 231 లీటర్ల సైజుతో మంచి పెద్ద బూట్ స్థలంతో వస్తుంది. టయోటా ఐగో ఎక్స్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 72 హెచ్‌పి, 205 ఎన్ఎమ్ వరకు గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ సీవీటి గేర్ బాక్స్ తో వస్తుంది. 2022లో యూరోప్ మార్కెట్లోకి తీసుకొనిరానున్నారు. మన దేశంలో ఎప్పుడూ తీసుకొస్తారు అనే విషయంపై స్పష్టత లేదు. 

(చదవండి: చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!)
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top