అంగారక గ్రహం నుంచి వచ్చిన పోస్ట్‌కార్డ్‌ను చూశారా..!

NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary - Sakshi

NASA Curiosity Rover Sends A Rare Postcard From Mars To Mark 10th Anniversary: భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్‌ రోవర్లను ప్రయోగించింది.  తాజాగా  క్యూరియాసిటీ రోవర్‌ను లాంచ్‌ చేసి నవంబర్‌ 26తో పది వసంతాలు ముగిశాయి.  2011 నవంబర్‌ 26న క్యూరియాసిటీ రోవర్‌ను నాసా లాంచ్‌ చేసింది. మార్స్‌పైకి పది సంవత్సరాల క్రితం ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ ఇంకా  పనిచేస్తోండడం గమనార్హం. 

అద్భుతమైన పోస్ట్‌కార్డ్‌..!
క్యూరియాసిటీ రోవర్‌ పది వసంతాలను పూర్తి చేసుకోవడంతో మార్స్‌ నుంచి భూమికి అద్భుతమైన ఫోటోలను పంపింది. మార్టిన్‌ ల్యాండ్‌స్కేప్‌లో క్యూరియాసిటీ రోవర్‌ బంధించిన ఆసక్తికరమైన రెండు బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను  నాసా తన సోషల్‌మీడియా ఖాతాలో క్యూరియాసిటీ పంపిన పోస్ట్‌కార్డుగా వర్ణిస్తూ షేర్‌ చేసింది.  


ఫోటో కర్టసీ: నాసా

క్యూరియాసిటీ పంపిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు కాస్త ఎడిట్‌ చేస్తూ..‘విష్‌ యూ వర్‌ హియర్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో సోషల్‌ మీడియా నాసా పోస్ట్‌చేసింది. క్యూరియాసిటీ రోవర్‌ 360 డిగ్రీల కెమెరా సహయంతో ఈ ఫోటోలను తీసింది. క్యూరియాసిటీ రోవర్‌ నిర్వహణ బాధ్యతలను నాసా జెట్‌ ప్రొపెల్షన్‌ లాబోరేటరీ చూసుకుంటుంది.  

ఇప్పటివరకు మార్స్‌పై క్యూరియాసిటీ కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి..!

మార్టిన్‌ రేడియేషన్‌ వాతావరణాన్ని అంచనా వేసింది.

అంగారక గ్రహాన్ని చేరిన ఏడు సంవత్సరాల తరువాత క్యూరియాసిటీ రోవర్‌ మార్స్‌పై ఉన్నపురాతన ప్రవాహాన్ని కనుగొంది. దీంతో మార్స్‌పై నీరు ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మార్స్‌ నేలపై జరిపిన డ్రిల్లింగ్‌ సహాయంతో సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ , కార్బన్‌తో  జీవానికి సంబంధించిన కొన్ని కీలక రసాయన పదార్థాలను క్యూరియాసిటీ గుర్తించింది.

పురాతన గేల్ క్రేటర్‌లో మిలియన్ల సంవత్సరాలుగా సరస్సులు ఉన్నాయని క్యూరియాసిటీ గుర్తించింది. 

చదవండి: ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top