
Rivian Valued 100 Billion Dollars In Debut After World Biggest IPO Of 2021: అమెజాన్ మద్దతు ఇస్తోన్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రివియన్ ఆటోమోటివ్ నాస్‌డాక్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టింది. కంపెనీ షేర్లు 53 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా రివియన్ ఆటోమొబైల్ నిలిచి రికార్డు సృష్టించింది. రివియన్ ఆటోమోటివ్ మార్కెట్ వాల్యుయేషన్ సుమారు 100 బిలియన్ డాలర్లకుపైగా చేరింది. రివియన్ షేర్లు 100.73 డాలర్ల వద్ద ముగిశాయి. ఐపీవో ఇష్యూతో పోలిస్తే సుమారు కంపెనీ షేర్ల విలువ దాదాపు 30శాతం మేర జంప్ అయ్యాయి.
టెస్లాకు గట్టిపోటీ..!
ఎలక్ట్రిక్ వాహనాల్లో పేరొందిన టెస్లాకు రివియన్ ఆటోమోటివ్ గట్టిపోటీను ఇచ్చేందుకు సిద్దమైంది. ఒక ట్రిలియన్ పైగా వాల్యుయేషన్‌తో నిలిచిన టెస్లా తరువాత రివియన్ రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా నిలిచింది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రివియన్ జరుపుతోంది. కంపెనీ రెవెన్యూ కొద్దిమేరే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్, సెమికండక్టర్ల కొరత రివియన్‌ను కూడా వెంటాడుతోంది. దీంతో కంపెనీ పెద్దమొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయలేకపోతుందని రివియన్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. రివియన్ ఆటోమోటివ్స్‌లో అమెజాన్ సుమారు 20 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభించిన ఆల్ ఎలక్ట్రిక్ ఆర్1టీ పికప్ ట్రక్‌ను రెట్టింపు చేస్తూ ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలను రివియన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వరుసగా రెండోసారి...! భారీ నష్టాలతో పేటీఎం..!