Elon Musk: టెస్లా షాక్‌, ఆ క్లబ్‌నుంచి ఔట్‌..అయినా..

Tesla share tumbles: Elon Musk drops below 200 billion dollars - Sakshi

టెస్లా సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఈలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌  తగిలింది. ఎలైట్ 200 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోంచి  తాజాగా కిందకి జారుకున్నాడు. మంగళవారం టెస్లా షేర్లు దాదాపు 7 శాతం కుప్పకూలడంతో మస్క్‌ సంపద కూడా అదే స్థాయిలో నష్టపోయింది.  ఈలాన్ మస్క్ నికర విలువ 5.40 శాతం క్షీణించి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. ఈ పరిణామం తరువాత మస్క్‌ సంపద 2021, ఆగస్టు స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.  

అయినా మస్క్‌ టాప్‌ ప్లేస్‌లో  కొనసాగుతుండటం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్  ప్రకారం అమెజాన్‌  సీఈవో జెఫ్ బెజోస్ 127.80  బిలియన్ల డాలర్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. గ్లోబల్‌ మార్కెట్‌లో కరెక్షన్‌తో దిగ్గజ కంపెనీలు నెట్‌ వాల్యూ బాగా క్షీణించింది. ముఖ్యంగా అమెజాన్ స్టాక్ ఈ ఏడాదిలో 35.4 శాతం నష్టపోగా,  టెస్లా షేరు 36.1 క్షీణించింది. మస్క్ విలువ ఇప్పుడు 204 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ నికర విలువ 131 బిలియన్ డాలర్లుగా ఉంది. 

మార్చి 2022లో ఈలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కిందికిపడిపోయింది. అయితే ఆ తరువాత నష్టాలనుంచి మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మస్క్‌ నికర విలువ తిరిగి ఎగిసి ఏప్రిల్‌ మాసంలో రికార్డు స్థాయిలో 288 బిలియన్‌ డాలర్లకు చేరింది. గ్లోబల్‌ రిచెస్ట్‌ మాన్‌గా అవతరించిన  తరువాత ట్విటర్‌లో 9 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఈ డీల్‌ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top