పాడుతా తీయగా చల్లగా... | Musicozy Sleep Headphones Bluetooth Headband Review | Sakshi
Sakshi News home page

పాడుతా తీయగా చల్లగా...

Aug 14 2022 10:04 AM | Updated on Aug 14 2022 10:04 AM

Musicozy Sleep Headphones Bluetooth Headband Review - Sakshi

జనాభాలో దాదాపు ముప్పయి శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఒక అంచనా. నిద్రలేమిని జయించడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తున్నా, వాటి వల్ల దక్కే ఫలితాలు అంతంత మాత్రమే! అయితే, నిద్రలేమికి చెక్‌ పెట్టడానికి సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చేసింది. ఇది బ్లూటూత్‌ సాయంతో పనిచేసే హెడ్‌ఫోన్స్‌ సెట్‌. ‘మ్యూజికోజీ హెడ్‌ఫోన్స్‌’గా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 ఇందులో కోరుకున్న సంగీతం కావలసినంత ధ్వనితో వింటూ తేలికగా నిద్రలోకి జారుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు. ‘పాడుతా తీయగా చల్లగా...’ అంటూ ఈ హెడ్‌ఫోన్స్‌ వినిపించే సంగీతాన్ని వింటూ హాయిగా నిద్రలోకి జారుకోగలుగుతున్నామని వినియోగదారులు కూడా చెబుతున్నారు. ఈ ‘మ్యూజికోజీ హెడ్‌ఫోన్స్‌’కు ఆన్‌లైన్‌లో రివ్యూలు బాగానే వస్తుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఈ హెడ్‌ఫోన్స్‌ ధర 25.70 డాలర్లు (రూ.2032) మాత్రమే! 


 

Advertisement
 
Advertisement
Advertisement