కాలేజ్‌ డ్రాప్‌అవుట్స్‌..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..!

Mumbai College Dropout Students Develop Grocery Delivery Zepto App Details Inside - Sakshi

Zepto Success Story In Telugu: కాలేజ్‌ డ్రాప్‌అవుట్స్‌...! అయితేనేం ఒక చిన్న ఐడియా 19 ఏళ్ల యువకుల జీవితాలనే మార్చేసింది. సుమారు రూ. 4310 కోట్ల విలువ కల్గిన కంపెనీకి అధిపతులుగా అవతారమెత్తి ఔరా..! అనిపిస్తున్నారు ముంబై యువకులు.

బలమైన బేసిక్స్‌తో..కంపెనీ స్థాపన..!
ముంబైకు చెందిన 19 ఏళ్ల కుర్రాళ్లు  ఆదిత్‌ పాలిచా, కైవల్య వోహ్రా అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సీటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రాం కోర్సు నుంచి తప్పుకున్నారు. భారత్‌కు వచ్చిన వీరు ఇరువురు జెప్టో (Zepto) అనే గ్రాసరీ స్టార్టప్‌ను స్థాపించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బలమైన బేసిక్స్‌ ఉండడంతో ఈ స్టార్టప్‌ నిర్వహణ మరింత సులువైంది. తొలుత ముంబై నగరాల్లో వీరు జెప్టో గ్రాసరీ సేవలను మొదలుపెట్టారు. భారీగా ఆదరణ రావడంతో బెంగళూరు, ఢిల్లీ, మరో నాలుగు నగరాలకు ఈ స్టార్టప్‌ సేవలను విస్తరించారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. 

5 నెలల్లోనే 570 మిలియన్‌ డాలర్లు..!
వై కాంబినేటర్‌ నిర్వహించిన ఫండింగ్‌ రౌండ్‌లో తాజాగా 100 మిలియన్‌ డాలర్లను  జెప్టో సొంతం చేసుకుంది. జెప్టో కంపెనీ స్థాపించిన 5 నెలల్లోనే 570 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 4310 కోట్ల) కంపెనీగా అవతారమెత్తింది. ఈ కంపెనీ ప్రముఖ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఈ  స్టార్టప్‌కు గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, బ్రేయర్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీకు చెందిన లాచీ గ్రూమ్ వంటి ఇన్వెస్టర్లు మద్దతునిస్తున్నాయి. 

దిగ్గజ కంపెనీలకు భారీ పోటీ...!
భారత ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల అభిప్రాయం. దీంతో ఆయా దిగ్గజ కంపెనీలు ఆన్‌లైన్‌ డెలివరీలపై దృష్టిసారించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీలు బ్లింక్‌ఇట్‌, డూంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ సేవలను అందిస్తోన్న​ కంపెనీలకు జెప్టో భారీ పోటీనిస్తోంది. 

చదవండి: పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top