Multibagger Penny Stocks: సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్‌గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!

Multibagger Penny Stocks Turned 1 Lakh To 5 67 Crore In Near 3 Years - Sakshi

స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్‌. స్టాక్‌ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్‌ పెన్నీ స్టాక్‌ ఐనా ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ మూడేళ్లలో భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

గత రెండేళ్లలో పలు కంపెనీల షేర్లు తమ వాటాదారులకు భారీ లాభాలనే అందించాయి. పెన్నీ స్టాక్‌ నుంచి మల్టీబ్యాగర్‌ స్టాక్‌గా ఎదిగిన వాటిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ షేర్లు కూడా ఒకటి. ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో 2019 మార్చిలో లిస్టింగ్‌ అయ్యింది. ఆ సమయంలో స్టాక్‌ ధర రూ. 0.35పైసలుగా ఉంది. గత మూడు ఏళ్లలో స్టాక్‌ విలువ 567 సార్లు పెరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ షేర్‌ ధర రూ. 198. 45 చేరింది. మూడేళ్ల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 5.67 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్‌ హోల్డర్లకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించింది. సుమారు మూడేళ్ల పాటు నిరీక్షించిన షేర్‌ హోల్లర్లకు ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ కాసుల వర్షానే కురిపించింది. 

ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్
ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ లిమిటెడ్  లాజిస్టిక్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్‌ సేవలను అందిస్తోంది. వేర్‌హౌసింగ్, పంపిణీ, సరుకు రవాణా, కస్టమ్స్ బ్రోకింగ్, కార్గో, కన్సాలిడేషన్, మల్టీమోడల్ రవాణా , వంటి సేవలను ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ అందిస్తుంది.
చదవండి: కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top