అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!

Mukesh Ambani Grandson, Prithvi, Seen On The First Day Of School - Sakshi

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ తన తల్లి శ్లోకా మెహతాతో కలిసి బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ఒక ప్లే స్కూల్‌లో అడుగుపెట్టాడు. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ ఆకాష్ అంబానీని మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకోవడం విశేషం. 

పృథ్వీ తల్లిదండ్రులు తమ కుమారునికి సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన విద్యను అందించడానికి ఈ స్కూల్‌ను ఎంచుకున్నారు. పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేష్ కుటుంబం కోరుకోవడం విశేషం. పృథ్వీ అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని సన్నాహాలు చేశారు. పృథ్వీ అంబానీ క్షేమంగా ఉండేందుకు ఆయన వెంట ఎప్పుడూ ఒక డాక్టర్ ఉండనున్నారు. అంబానీ మొదటి మనవడి భద్రత చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారు సాధారణ దుస్తులలో ఉంటారు. అటుగా వచ్చేవారిపై నిఘా పెట్టి ఉంటారు. 2019లో వివాహం చేసుకున్న శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీలకు పృథ్వీ ఆకాష్ అంబానీ డిసెంబర్ 10, 2020న జన్మించారు.

(చదవండి: దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ కొన్న కేరళ బిలియనీర్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top