Moto G73 5G Launched In India, Check Price Details And Features - Sakshi
Sakshi News home page

ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన మొబైల్ లాంచ్.. ధర కూడా తక్కువే!

Mar 10 2023 4:01 PM | Updated on Mar 10 2023 4:38 PM

Moto g73 5g launched in india price and details - Sakshi

ఆధునిక ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలవుతోంది. ఇందులో భాగంగానే మోటోరోలా కంపెనీ జీ సిరీస్‍లో మరో బడ్జెట్ 5జీ ఫోన్‍ విడుదల చేసింది. ఈ కొత్త మొబైల్ కేవలం ఒకే వేరియంట్‌లో రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంటుంది.

కొత్త మోటో జీ73 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగి ల్యుసెంట్ వైట్, మిడ్‍నైట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఇది మార్చి 16 నుంచి ఫ్లిప్‍కార్ట్‌లో అమ్మకాలని అందుబాటులో ఉంటుంది. కార్డు ఆఫర్ ద్వార కొనుగోలు చేసేవారు రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా వినియోగించుకోవచ్చు.

మోటో జీ73 5జీ మొబైల్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎల్‍సీడీ డిస్‍ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍ కూడా ఉంటుంది. ఈ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 14 అప్‍డేట్ వస్తుందని మోటోరోలా తెలిపింది.

(ఇదీ చదవండి: బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?)

లేటెస్ట్ మోటో జీ73 5జీ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా పొందుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‍ఎఫ్‍సీ, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5 మిమీ హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement