Montra Electric Super Auto Launched - Here Price, Range & Specs - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్‌ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ ఆటోలు.. ధర ఎంతంటే?

May 4 2023 12:15 PM | Updated on May 4 2023 1:16 PM

Montra Electric Super Auto Price, Range And Reviews 2023 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తమ వాహనాలను ప్రవేశపెట్టింది. విజయవాడ, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో ఇవి టెస్ట్‌ రైడ్‌లకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ కేకే పాల్‌ తెలిపారు. దీని ధర రూ. 3.02–3.45 లక్షల వరకు (సబ్సిడీ అనంతరం ఎక్స్‌ షోరూం రేటు) ఉంటుందని పేర్కొన్నారు. 

తెలంగాణలోని ఖమ్మం, మంచిర్యాలలో కూడా వీటిని అందుబాటులోకి తెచి్చనట్లు చెప్పారు. సింగిల్‌ చార్జితో ప్రామాణికంగా 197 కి.మీ., సాధారణ పరిస్థితుల్లో 160 కి.మీ. ఈ సూపర్‌ ఆటోల రేంజి ఉంటుందని ఆయన వివరించారు. ఇవి గరి ష్టంగా గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. 

3 ఏళ్లు / 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో పాటు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్, 2 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ మొదలైన ఆప్షన్లు ఉంటాయి. ఆసక్తి గల వారు స్వల్ప రిఫండబుల్‌ మొత్తాన్ని చెల్లించి ప్రీ–బుక్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement