పిల్లల కోసం చిట్టి రోబోలు వచ్చేస్తున్నాయ్‌!, అవి ఎలా పనిచేస్తాయంటే?

Miko Ai Robot Review - Sakshi

ఫొటోలోని చిన్నారి ఒళ్లో పెట్టుకుని ఆడుకుంటున్నది ఉత్త ఆటబొమ్మ కాదు, ఇది రోబో. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబో ‘మైకో 3’ పేరుతో గత ఏడాది మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది పిల్లలకు నేస్తంలా ఉంటూ ఎన్నెన్నో ఊసులు చెబుతుంది.

దీనితో ఆడుకునే పిల్లల్లో మాట్లాడే సామర్థ్యం, ఆటలాడే సామర్థ్యం, చదువుల్లో పోటీపడే సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆటబొమ్మలను తయారు చేసే బహుళజాతి సంస్థ ‘మైకో’ ఈ రోబోను చిన్నారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో వైఫై కనెక్షన్‌ ద్వారా పనిచేస్తుంది.

ఆటలాడేటప్పుడు బ్యాటరీ ఐదుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. ‘హలో మైకో’ అంటే ఇది బదులు పలుకుతుంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా చకచకా బదులు చెబుతుంది. ఈ రోబో ఇంగ్లిష్, స్పానిష్, చైనీస్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్‌ భాషలను అర్థం చేసుకుంటుంది. వీటిలో ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో బదులిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,734) మాత్రమే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top