మార్కెట్లు అప్‌- ఈ చిన్న షేర్లు గెలాప్‌‌

Mid and Small cap shares zoom in positive market - Sakshi

103 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ లాభాల పరుగు

జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, హిందుస్తాన్‌ కాపర్‌

సొమానీ సిరామిక్స్‌, ఓరియంట్‌ బెల్‌, ఒమాక్స్‌ ఆటోస్‌

ఆటుపోట్ల మధ్య వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 106 పాయింట్లు పెరిగి 40,538కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 11,896 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐబీ ఇంటిగ్రేటెడ్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, హిందుస్తాన్‌ కాపర్‌, సొమానీ సిరామిక్స్‌, ఓరియంట్‌ బెల్‌, ఒమాక్స్‌ ఆటోస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 54.25 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 32,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 79,000 షేర్లు చేతులు మారాయి.

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 15.2 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.61 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 34.3 లక్షల షేర్లు చేతులు మారాయి.

హిందుస్తాన్‌ కాపర్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10.4 శాతం లాభపడి రూ. 36.25 వద్ద  ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 39,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.4 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి.

సొమానీ సిరామిక్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 223 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 231 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 34,500 షేర్లు చేతులు మారాయి.

ఓరియంట్‌ బెల్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 125 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 137 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 27,500 షేర్లు చేతులు మారాయి.

ఒమాక్స్‌ ఆటోస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం ర్యాలీతో రూ. 40 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 42ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 1,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top