Mi Notebook Pro X 15 : అదిరే ఫీచర్లతో వచ్చేస్తోంది

Mi Notebook Pro X 15 With 11th-Gen Intel Processors Will Launch On July 9  - Sakshi

25 నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం ఛార్జింగ్‌

3.5 కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే , ఆటోమేటిక్‌ బ్రైట్‌నెస్‌

రెండు వెర్షన్లలో లభించనున్న నోట్‌బుక్‌  

షియోమి నుంచి మరో అదిరిపోయే నోట్‌బుక్‌ వచ్చింది. గతేడాది విడుదలైన సక్సెస్‌ఫుల్‌ నోట్‌బుక్‌ సిరీస్‌ 15ని మరింతగా అప్‌డేట్‌ చేసి ప్రో ఎక్స్‌గా  కొత్త వెర్షన్‌ని రిలీజ్‌కి ఎంఐ సిద్ధమైంది. 

ఫాస్ట్‌ ఛార్జింగ్‌
నోట్‌బుక్‌ ప్రో ఎక్స​ 15లో అందరినీ ఎక్కుగా ఆకట్టుకునే ఫీచర్లు రెండున్నాయి. అందులో ఒకటి ఛార్జింగ్‌ స్పీడ్‌. ఈ నోట్‌బుక్‌తో పాటు 130 వాట్స్‌ ఛార్జర్‌ని అందించింది. దీంతో కేవలం ఇరవై ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ  80Whrగా ఉంది.  ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్‌ చేస్తే 11.50 గంటల పాటు పని చేస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే  నోట్‌బుక్‌ ప్రో ఎక్స్‌ 15లో 15.6 ఇంచ్‌ డిస్‌ప్లే ఉంది. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు 3.5 కే ఓఎల్‌ఈడీ టెక్నాలజీని డిస్‌ప్లేకి జత చేశారు. అయితే పిక్సెల్‌ డెన్సిటీ విషయంలో ఎంఐ కాంప్రమైజ్‌ అయ్యింది. కేవలం 221 పీపీఐనే అందించింది.
 
ఇతర ఫీచర్లు
విండోస్‌ 10పై పని చేసే ఎంఐ నోట్‌బుక్‌ ప్రో ఎక్స్‌ 15లో గేమింగ్‌ కోసం నివిడియా జీఈఫోర్స్‌  ఆర్టీఎక్స్‌ 3050 టీఐ గ్రాఫిక్‌ కార్డుని ఉపయోగించారు. ఇక ప్రాసెసర్‌కి సంబంధించి 11 జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5-11300H ని  వాడారు. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని అందించారు. డీటీఎస్‌ టెక్నాలజీతో కూడిన 4 స్పీకర్లు అమర్చారు.  వాతావరణ మార్పులకు అనుగుణంగా బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్‌ చేసుకునే ఆప్షన్‌ డిస్‌ప్లే, కీబోర్డులలో అందించారు. రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక టైప్‌ సీ పోర్టు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 

జులై 9న
ఎంఐ నోట్‌బుక్‌ ఎక్స్‌ 15 లాప్‌ట్యాప్‌ జులై 9 నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంది. 16 జీబీ ర్యామ్‌ 512 ఇంటర్నల్‌ మెమోరీ మోడల్‌ ఇండియన్‌ మార్కెట్‌లో రూ. 92,100కు లభించనుండగా 32 జీబీ ర్యామ్‌, వన్‌ టెరాబైట్‌ ఇంటర్నల్‌ మెమోరీ ఉన్న మోడల్‌ ధర రూ. 1,15,100గా ఉంది. తొలుత చైనాలో  రిలీజ్‌ చేసి ఆ తర్వాత ఇతర మార్కెట్లకు వస్తామని షియోమీ తెలిపింది. 

చదవండి : ఆన్‌లైన్‌ అంగట్లో లింక్డిన్‌ యూజర్ల డేటా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top