Mastercard: బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్‌ కార్డ్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Mastercard Allow Cryptocurrency Purchases - Sakshi

Mastercard Allow Cryptocurrency Purchases: క్రిప్టోకరెన్సీ పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. మళ్లీ అంతలోనే రాకెట్‌లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంత బజ్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడి పెట‍్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిలో మరింత జోష్‌ను నింపేందుకు ప్రముఖ ఫైనాన్షియల్‌ దిగ్గజం మాస్టర్‌ కార్డ్‌ బ్యాంకుల్లో డెబిట్‌ కార్డ్‌, క్రిడెట్‌ కార్డ్‌ల నుంచి క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. 

మాస్టర్‌ కార్డ్‌ అనేది బ్యాంకులకు, వినియోగదారులకు మధ్య వారధిగా నిలుస్తోంది. మాస్టర్‌ కార్డ్‌ అందిస్తున్న కార్డ్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకుల్లో ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మాస్టర్‌ కార్డ్‌ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహించే సంస్థ 'బక్ట్' తో ఒప్పొందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంకుల్లో మాస్టర్‌ కార్డ్‌ ద్వారా క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పించింది. ఆయా బ్యాంకుల నుంచి బక్ట్‌లో క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించినందుకు మాస్టర్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్లను అందించనుంది.      

ప్రాధమికంగా మాస్టర్ కార్డ్ గ్లోబల్ పేమెంట్స్ నెట్‌వర్క్ కు చెందిన బ్యాంకుల్లో మాత్రమే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై క్రిప్టో లావాదేవీల్ని నిర్వహిస్తే రివార్డ్‌ పాయింట్లను అందిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షెర్రీ హేమండ్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు వినియోగదారులకు క్రిప్టో లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు, బ్యాంకులు, ఫిన్‌టెక్, వ్యాపారులు ఇలా ఎవరైనా బక్ట్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం అవ్వడం ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, అమ్మే వెసలుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఇండియాలో మాస్టర్‌ కార్డ్‌లపై నిషేధం 
ఈఏడాది జూలై 14న ఆర్బీఐ స్థానిక డేటా నిల్వ నిబంధనలను పాటించనందుకు కొత్త క్రెడిట్, డెబిట్,ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా మాస్టర్‌ కార్డ్‌పై నిషేదం విధించింది. జూలై 22, 2021 నుండి అమల్లోకి వచ్చేలా మాస్టర్‌ కార్డ్‌ కొత్త దేశీయ కస్టమర్లను తన కార్డ్ నెట్‌వర్క్‌కు జోడించకుండా సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. డేటా స్థానికీకరణ నియమాల ప్రకారం, కంపెనీ భారతీయ వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచాల్సిన అవసరం ఉందని వివరించింది. 

చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..వెయ్యి పెట్టుబడితో 3.45 లక్షలు సంపాదించారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top