మార్కెట్లు వీక్‌- ఈ చిన్న షేర్లు రయ్‌రయ్‌

Market weaken- Mid and Small cap shares zoom - Sakshi

సెన్సెక్స్‌ 46 పాయింట్లు డౌన్‌- 38,794కు

ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

జాబితాలో  కోఫోర్జ్‌, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్‌, ఎంఎం ఫోర్జింగ్స్‌

ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ, మేఘమణి ఆర్గానిక్స్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌ఫోర్ట్స్

ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ 46 పాయింట్లు క్షీణించి 38,794కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో కోఫోర్జ్‌ లిమిటెడ్‌, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్‌, ఎంఎం ఫోర్జింగ్స్‌, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ, మేఘమణి ఆర్గానిక్స్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌ఫోర్ట్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

కోఫోర్జ్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 2,078 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2080 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 13,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,000 షేర్లు చేతులు మారాయి.

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసి రూ. 673 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 679 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.96 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 69,000 షేర్లు చేతులు మారాయి.

ఎంఎం ఫోర్జింగ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 297 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 310 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 8,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి.

ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 1352 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 750 షేర్లు చేతులు మారాయి.

మేఘమణి ఆర్గానిక్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 77 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.55 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.75 లక్షల షేర్లు చేతులు మారాయి.

గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి  రూ. 60 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 45,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top