పతన మార్కెట్లో.. చిన్న షేర్ల పరుగు

Market tumbles- Mid Small cap stocks jumps - Sakshi

అమ్మకాల షాక్‌- 668 పాయింట్లు డౌన్‌

40,017 వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్‌

206 పాయింట్లు కోల్పోయి 11,724కు చేరిన నిఫ్టీ

ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌

జాబితాలో ఐఎఫ్‌బీ, జస్ట్‌ డయల్‌, జీహెచ్‌సీఎల్‌

మిడ్‌సెషన్‌కు ముందుగానే ఊపందుకున్న అమ్మకాలు దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 668 పాయింట్లు పడిపోయి 40,017ను తాకింది. నిఫ్టీ సైతం 206 పాయింట్లు పతనమై 1,724 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో కొన్ని కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లగా..కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకుంది. జాబితాలో ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌, జీహెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌, ప్రైమ్‌ఫోకస్‌, తాల్‌బ్రోస్‌ ఆటోమోటివ్‌, ఎన్‌డీఆర్‌ ఆటో కంపోనెంట్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 5.2 శాతం జంప్‌చేసి రూ. 756 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 794 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 10,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 20,000 షేర్లు చేతులు మారాయి.

జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 635 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 642ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.21 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.11 లక్షల షేర్లు చేతులు మారాయి.

జీహెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం వృద్ధితో రూ. 163 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 168 వరకూ బలపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 48,000 షేర్లు చేతులు మారాయి.

ప్రైమ్‌ఫోకస్‌ లిమిటెడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 7.5 శాతం పురోగమించి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 45 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,500 షేర్లు చేతులు మారాయి.

తాల్‌బ్రోస్‌ ఆటోమోటివ్
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 135 వరకూ పెరిగింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 25,000 షేర్లు చేతులు మారాయి.

ఎన్‌డీఆర్‌ ఆటో కంపోనెంట్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 152 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 900 షేర్లు మాత్రమేకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top