రికార్డుల ర్యాలీ- ప్రభుత్వ బ్యాంక్స్‌ హవా | Market record rally- PSU Banks zoom | Sakshi
Sakshi News home page

రికార్డుల ర్యాలీ- ప్రభుత్వ బ్యాంక్స్‌ హవా

Dec 8 2020 3:56 PM | Updated on Dec 8 2020 3:59 PM

Market record rally- PSU Banks zoom - Sakshi

ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్‌ కొనసాగుతోంది. వెరసి మరోసారి రికార్డుల ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్‌ 181 పాయింట్లు ఎగసి 45,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 13,393 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 45,742ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 13,435ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్‌-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌కు భారీ డిమాండ్‌ కనిపించడం గమనార్హం!  చదవండి: (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

మీడియా వీక్
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 7.15 శాతం దూసుకెళ్లగా.. రియల్టీ, ఐటీ 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే మెటల్‌, ఫార్మా, మీడియా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ 3-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌,  టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌, ఎయిర్‌టెల్‌ 2.3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.

బ్యాంకింగ్‌ జోష్‌
డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్ 19 శాతం‌, పీఎన్‌బీ 15 శాతం, బీవోబీ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో భెల్‌, వేదాంతా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, పీవీఆర్, చోళమండలం 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు  ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పెట్రోనెట్‌, లుపిన్‌, జిందాల్‌ స్టీల్‌, పీఎఫ్‌సీ, బంధన్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 2.6-1.8 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,498 లాభపడగా.. 1,460 నష్టాలతో నిలిచాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement