టాటా, మారుతి, హ్యుందాయ్‌: కారు ఏదైనా ఆఫర్‌ మాత్రం భారీగానే!

March Offers that you should not miss Maruti Hyundai Tata car discounts - Sakshi

సాక్షి, ముంబై:  ఆటోమొబైల్‌ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా  కంపెనీలు తమ పలు  మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం.  మారుతి, హ్యుందాయ్‌, టాటా కార్లపై  ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం.  (రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే )

మారుతి కార్లపై డిస్కౌంట్లు
మార్చిలో రూ. 52వేల  వరకు తగ్గింపుతో  మారుతి సుజుకి ఇగ్నిస్‌ను కొనుగోలు చేయవచ్చు.  అలాగే మారుతి  సియాజ్‌పై రూ. 28 వేల  వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్‌ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల  డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్‌ కొనుగోలుపై రూ. 10 వేల వరకు  తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!)

అయితే మారుతి సుజుకి బాలెనో,  బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు.

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు
మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు  దాకా,  పాపులర్‌  ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.

అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు.

టాటా కార్లపై డిస్కౌంట్లు
అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్‌పై రూ. 30వేల  వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top