యాక్సిమ్‌తో జట్టు కట్టిన మెజెంటా | Magenta and Axiom Companies tie up To develop Infra In EV Segment | Sakshi
Sakshi News home page

యాక్సిమ్‌తో జట్టు కట్టిన మెజెంటా

Dec 9 2021 8:00 PM | Updated on Dec 9 2021 8:01 PM

Magenta and Axiom Companies tie up To develop Infra In EV Segment - Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో దేశీ కంపెనీలుగా దినదినాభివృద్ధి చెందుతున్న యాక్సి్‌మ్‌, మెజెంటా కంపెనీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. మెజెంటా సంస్థ ఈవీ వెహికల్స్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ విభాగంలో పని చేస్తుండగా యాక్సి్‌మ్‌ సంస్థ ఈవీ ఛార్జర్లు, కాంపోనెంట్ల తయారీలో ఉంది.


దేశీయంగా ఈవీ మార్కెట్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజుకో కంపెనీ ఈవీ వెహికల్స్‌ తయారీలోకి వస్తున్నాయి. టూ వీలర్‌ మొదలు భారీ ట్రక్కుల వరకు త్వరలో ఈవీ వెహికల్స్‌ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. అయితే ఛార్జింగ్‌ పాయింట్లు అనేది ఈవీ వెహికల్స్‌కి అతి ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఈ రంగంలో మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించే దిశగా యాక్సిమ్‌, మెజెంటాలు కలిసి పని చేయనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement