ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ వంతు..భారీగా పెరిగిన ధరలు...! కొత్త ధరలు ఇవే..

LPG cylinder price hike: Cooking gas becomes costlier by 250 from april 1 - Sakshi

LPG Gas Price Hike: గత పది రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులకు కంటికునుకు లేకుండా పోయింది. ఇప్పుడు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా పెంచాయి. కాగా డొమెస్టిక్‌ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

సిలిండర్‌పై ఏకంగా రూ. 250 పెంపు..!
19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లపై ఏకంగా రూ. 250 పెంచేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. పెరిగిన ధరలు నేటి(ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్‌ సిలిండర్లపై ధరల పెంపు లేకపోవడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. 

19 కేజీల సిలిండర్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి...

  • ఢిల్లీలో కొత్త ధర రూ. 2253,  పాత ధర రూ.2003
  • కోల్‌కత్తాలో కొత్త ధర రూ. 2351 ,  పాత ధర రూ.2087
  • ముంబైలో కొత్త ధర రూ. 2205,  పాత ధర రూ.1955
  • చెన్నైలో కొత్త ధర రూ. 2406,  పాత ధర రూ.2138
  • హైదరాబాద్‌లో కొత్త ధర రూ. 2460, పాత ధర రూ. 2186

చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో వేరేలా..విచిత్రమైన పరిస్థితులు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top