ఎన్‌బీఎఫ్‌సీ సెక్యూరిటైజ్డ్‌ రుణ ఆస్తుల్లో వృద్ధి!

Loan Assets Securitised By Nbfcs Jump 43 Pc To Rs 1.25 Lakh - Sakshi

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), గృహ రుణ సంస్థల (హెచ్‌ఎఫ్‌సీలు) సెక్యూరిటైజ్డ్‌ (రక్షణతో కూడిన) రుణ ఆస్తులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 43 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం కలిసొచ్చింది.

 2020–21 సంవత్సరానికి సెక్యూరిటైజ్డ్‌ రుణ ఆస్తులు రూ.87,300 కోట్లుగా ఉన్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరికి ఇవి కరోనా ముందున్న రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. ‘‘2021–22లో సెక్యూరిటైజ్డ్‌ రుణ ఆస్తుల వృద్ధికి ప్రధాన కారణం.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బేస్‌ తక్కువగా ఉండడంతోపాటు.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం. కరోనా మూడో విడతలో అవరోధాలు తక్కువగా ఉండడమే’’ అని ఇక్రా తెలిపింది. 

చెల్లింపులు సక్రమంగా జరిగే రుణాలనే  సెక్యూరిటైజ్డ్‌ రుణ ఆస్తులుగా పేర్కొంటారు. మోర్ట్‌గేజ్, రుణాలు, బాండ్లు, క్యాపిటల్‌ మార్కెట్లలో జారీ చేసే సెక్యూరిటీలు వీటి కిందకు వస్తాయి. ఈ తరహా రిటైల్‌ రుణాలు రూ.1.1 లక్షల కోట్లుగా ఉంటే, హోల్‌సేల్‌ రుణ ఆస్తులు రూ.15,000 కోట్లుగా ఉన్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top