ఎల్‌ఐసీ ఐపీవో నిర్వహణకు క్యూ

Life Insurance Corporation of India Initial Public Offering - Sakshi

రేసులో 16 మర్చంట్‌ బ్యాంకర్లు

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ నిర్వహణకు మర్చంట్‌ బ్యాంకర్‌ సంస్థలు క్యూ కడుతున్నాయి. సుమారు 16 సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్‌) వద్ద మంగళ, బుధవారాల్లో ఈ కంపెనీలు ప్రెజంటేషన్‌ ఇవ్వనున్నాయి. 23న ఐపీవో నిర్వహణ వివరాలు ఇవ్వనున్న విదేశీ బ్యాంకర్ల జాబితాలో బీఎన్‌పీ పరిబాస్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, డీఎస్‌పీ మెరిల్‌ లించ్, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్‌ ఇండియా, నోమురా ఫైనాన్షియల్‌ అడ్వయిజర్స్‌ ఉన్నాయి. ఈ బాటలో 24న యాక్సిస్‌ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్‌ అడ్వయిజర్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, ఎస్‌బీఐ క్యాపిటల్‌  ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top