ఈ స్మార్ట్‌ఫోన్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌

LG Electronics may shut mobile phone business - Sakshi

ఎల్‌జీ సంచలన నిర్ణయం?  

మార్కెట్‌లో ఇక ఎల్‌జీ ఫోన్లు మాయం

ఇప్పటికే నిలిపివేసిన స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి

సాక్షి, న్యూఢిల్లీ:  మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌  అభిమానులా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. దక్షిణ కొరియా  సంస్థ ఎల్‌జి ఎలక్ట్రానిక్స్  ఎల్‌జీ ఫ్యాన్స్‌ను నిరాశపర్చే సంచలన నిర్ణయం దిశగా కదులుతోందట. మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలని కంపెనీ భావిస్తోందట. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలకు సంబంధించిన వ్యూహాలు  సఫలం కాకపోవడం వ్యాపార భాగస్వామ్య చర్చలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని అంచనా.   

దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్‌సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్‌జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ ప్లాన్లను ఎల్‌జీ నిలిపివేసింది. రోలబుల్ డిస్‌ప్లే  ఫోన్‌ల ఉత్పత్తిని కంపెనీ గత నెలలో నిలిపివేసిందని డోంగా తెలిపింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది. అటు మొబైల్ పరికరాలకు  గ్లోబల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నందున  ఎల్‌జీ మంచి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా హెరాల్డ్ జనవరిలో ఒక ఎల్జీ అధికారిని ఉటంకిస్తూ తెలపింది.

కాగా మొబైల్ కమ్యూనికేషన్స్‌లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్ సియోక్ గత జనవరి నెలలో ప్రకటించారు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు (రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించి నట్లు బాంగ్  తెలిపారు. దీనిపై విధివిధాలను ఏప్రిల్ తొలివారంలో ప్రకటిస్తామని  ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top