Laptop Sales In India: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్స్‌ ఏవంటే..!

Laptop Sales In India Are At All Time High As HP Dell Lenovo - Sakshi

కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్‌ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్‌మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్‌ కంపెనీలు షిప్పింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. 

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది.  పర్సనల్‌ కంప్యూటర్‌ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్‌ సొం‍తం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్‌ సాధించింది. 

2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్‌టాప్స్‌ షిప్‌మెంట్‌లు 11.5 శాతం వృద్ధి చెందాయి.  

ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం  ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది.

మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్‌ కంప్యూటర్లను  షిప్పింగ్ చేసింది.

యాపిల్‌ లాంట్‌ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో  సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి.  

సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ  ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్‌ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్‌ ల్యాప్‌టాప్‌ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి.  డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు 16.5 శాతంగా నిలిచాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top